వివరాళ్లోకి వస్తే… కరోనా వచ్చిన కొత్తలో ఏపీ ముఖ్యమంత్రి ఓపెన్ గా ఇచ్చిన స్టేట్ మెంట్… “కరోనాతో సహజీవనం చేయాల్సి ఉంటుందని”! అవును… కరోనాతో ప్రపంచానికున్న పంచాయితీ ఇప్పట్లో పోదని.. సహజీవనం తప్పదని జగన్ చెప్పిన సంగతి తెలిసిందే! అప్పుడు టీడీపీ నేతలు – చంద్రబాబు చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు! ఏపీ ముఖ్యమంత్రి అవగాహనలేకుండా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు! సరే దానికైనా కట్టుబడి ఉన్నారా అంటే… ఇప్పుడు జగన్ చెప్పిన మాటలనే చెబుతున్నారు బాబు!
అవును… కరోనా మీద వెబినార్ నిర్వహిస్తున్న చంద్రబాబు.. ” కరోనా నుంచి ఇప్పుడప్పుడే బయటపడే అవకాశం లేదు” అని చెప్పుకొచ్చారు! మరి జగన్ కరోనా వచ్చిన కొత్తలోనే చెప్పింది ఇదే కదా!! ఇక.. కరోనా నుంచి ఇప్పుడప్పుడే విముక్తి ఉండదని బాబు చెప్పడం ఒకెత్తు అయితే… కరోనా తగ్గినవెంటనే కార్యకర్తల దగ్గరకు వస్తానని చెప్పిన మాటలు ఈ సందర్భంగా నెట్టింట వైరల్ అవుతున్నాయి!!
అవును… కరోనా ఇప్పట్లో తగ్గదని చెబుతున్న బాబు.. ఈ మాట చెప్పడానికి రెండు రోజుల ముందు.. “కరోనా తగ్గిన తర్వాత కార్యకర్తలను కలుస్తానని, పార్టీని బలోపేతం చేస్తానని” చెప్పుకొచ్చారు! ఈ లెక్కన చూసుకుంటే… “బాబు కూడా ఇప్పుడప్పుడే జనం మధ్యకు వచ్చేది ఉండదు”అన్నమాట!! బాబు తాను జనల్లోకి ఇప్పట్లో రాలేనని చెప్పడం కోసం.. ఏమాటైతే జగన్ చెప్పారో, ఆ మాట జగన్ చెప్పినప్పుడు టీడీపీ నేతలు ఎలా రంకెలేశారో జనాలు మరిచిపోకముందే.. మళ్లీ అదేమాటను బాబుగారు చెప్పుకొచ్చారు!