మరోసారి అబాసుపాలైన “జూమ్” బాబు!

-

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఏం చేసినా అది వ్యతిరేకంగానే కొడుతుంది. నిజంగా ఆయన చేసింది ఏమీ లేకపోయినా.. గొప్పలు చెప్పుకోవడంలో దిట్టగా మారారు. ఈ మధ్య జూమ్ యాప్ ద్వారా ఆయన హయాంలో చేసిన ఘన కార్యాలను ప్రజలకు తెలియవు అన్నట్లు ఏకరువు పెడుతుండటంతో ప్రజల్లో మరీ చులకన అయిపోతున్నారు. అబాసు పాలౌతున్నారు. చౌకబారు ఉపన్యాసాలతో చంద్రబాబు ఏకధాటిగా.. టీడీపీ దండకంగా ఎన్నికల్లో ఎలా అయితే గంటలు గంటలు ప్రజలకు నూరుపోద్దామని చూశారో ఇప్పడు జూమ్ యాప్ ద్వారా అదే పంథాను స్టార్ట్ చేశారని తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆవేదనకు లోనౌతున్నారు.

ముఖ్యంగా ఏపీలో సమ అభివృద్ధి కోసం మూడు రాజధానుల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ పడటంతో చంద్రబాబు 48 గంటలకు ఓ సారి జూమ్ తో ప్రజలను చైతన్యపరచాలని చూస్తున్నారు. కానీ… జూమ్ బాబు ప్రసంగాలు మీడియాకు కూడా బూస్టింగ్ ఇవ్వడం లేదని.. ఆయా మీడియా యాజమాన్యాలు కూడా వాపోతున్నాయి. తమ మీడియాను చూసేందుకు వీక్షకులు రోజు రోజుకూ దూరమైపోతున్నారని కూడా వాపోతున్నారు. సరే ఏది ఏమైనప్పటికీ.. ఇరువురు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియాను బాబు.. బాబును మీడియా బ్రతికించాలనే ఒక ఒప్పంది కూడా కుదుర్చుకొని ఆ విధంగా ఈ విధంగా ముందుకు పోతున్నారని కూడా సమాచారం అందుతుంది!!

తాజాగా రెండోసారి 48 గంటల తర్వాత ఆన్ లైన్ లోకి వచ్చిన జూమ్ బాబు తిరిగి అదే రొడ్డ కొట్టుడు ఉపన్యాసాన్ని మొదలెట్టారు. తమ హయాంలో ముఖ్యంగా 16 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి తెచ్చి బీభత్సకరంగా.. అభివృద్ధి చేసినట్లు చెప్పుకొచ్చారు! పదే పదే కియా మోటార్స్ వంటివి చెప్తూ… అలాంటివి ఎన్నో రాయలసీమలో తెచ్చామని.. ఉత్తరాంధ్రలో కూడా ఎన్నో ప్రాజెక్టులు తెచ్చామని నోరుపారేసుకొని మరోసారి జూమ్ బాబు అబాసుపాలయ్యారని తెలుగు తమ్ముళ్లే వాపోతున్నారు.

అలాగే.. తాను రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూనే.. మొత్తం 13 జిల్లాలకు కలిపి 160 ప్రాజెక్టులు ప్రకటించామని.. అందులో కొన్ని ఇప్పటికే పూర్తయ్యాని.. మరి కొన్ని పూర్తికావాల్సి ఉందని అంటున్నారు బాబు. ఏది ఏమైనా… మొత్తానికి జూమ్ బాబు 48 గంటలకు ఓసారి వచ్చి టీడీపీ దండకాన్ని వల్లించేస్తున్నారని.. ఆవిధంగా మరోసారి బాబు అబాసు పాలయ్యారని తెలుగు తమ్ముల్లే వాపోవడం కొసమెరుపు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version