బీజేపీలోకి చిరు.. విష్ణువర్ధన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

-

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు (60) కరోనా వైరస్ బారినపడి మరణించిన సంగతి తెలిసిందే. అయితే శనివారం నాడు విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన మాణిక్యాలరావు సంతాప సభ జరిగింది. దీనికి సునీల్ డియేదర్, విష్ణువర్ధన్ రెడ్డి హాజరవగా.. పలువురు ముఖ్యనేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని నివాళులు అర్పించారు. అయితే ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కాంగ్రెస్ సీపీఐ సీపీఎం పార్టీలు వేరయినా స్కీఫ్ట్ మాత్రం టీడీపీదేనని చెప్పుకొచ్చారు.

అలాగే చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అదేవిధంగా తుల పక్షాన బీజేపీ నిలబడతుందన్న అయన రాజ్యాంగం అందరికి సమానంగా ఉంటుందని అన్నారు. ఒకప్పుడు సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టానికి వీల్లేదన్న చంద్రబాబు ఇప్పుడు రాజధాని విషయంలో కేంద్రo జోక్యం  చేసుకోవాలని ఎలా అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. అలాగే చిరంజీవి బీజేపీలోకి వస్తామంటే స్వాగతిస్తామని ఆయన అన్నారు. కాగా, రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత సోము వీర్రాజు, చిరంజీవిని కలిసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version