విశాఖ జిల్లా విద్యుత్ ఉద్యోగి లైన్ మెన్ బంగార్రాజు హత్యపై డిజిపి గౌతం సవాంగ్‌కు లేఖ రాశారు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు. విద్యుత్ లైన్‌మెన్ గా పనిచేస్తూ దారుణ హత్యకు గురైన బంగార్రాజు మృతదేహం ఏనుగులపాలెంలోని మంత్రి బొత్స మేనల్లుడు లక్ష్మణరావు గెస్ట్ హౌస్ పక్కనే లభ్యమైందని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.
మృతదేహం లభ్యమై నాలుగైదు రోజులైనా ఇంకా పోస్ట్‌మార్టం నిర్వహించక పోవడం విచారకరమనీ మండిపడ్డారు చంద్రబాబు. హంతకుల పై కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసుల జాప్యం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బంగార్రాజు హత్య లో అధికార వైఎస్సార్‌సీపీకి చెందిన అగ్ర నేతల ప్రమేయం ఉండడంతోనే పోలీసులు ఈ కేసులో ముందుకెళ్లకుండా వెనుకంజ వేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. పోలీసులు సత్వరం విచారణ చేపట్టి.. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా ప్రశాంతతకు మారు పేరు.. కానీ, నేడు శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయని అగ్రహించారు. భూకబ్జాలు, హత్యలతో విశాఖ క్రైమ్ సిటీగా మారిపోయిందని మండిపడ్డారు చంద్రబాబు.