బాబు బైట్ : ఒక్క రోడ్ షో.. వంద స‌మ‌స్య‌లు

-

గెలుపో ఓట‌మో ఛోడ్ దో.. పార్టీని నిల‌బెట్టేందుకు ఇవాళ్టికీ ఆయ‌న క‌ష్ట‌ప‌డుతున్నారు. ఏడు ప‌దులు దాటిన వ‌య‌స్సులోనూ నిరుత్సాహంలో ఉన్న క్యాడ‌ర్ లో ఉత్సాహం నింపేందుకు ప్ర‌య‌త్నిస్తూ ఉన్నారు. పార్టీని కాపాడుకునేందుకు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో మంచి ఫ‌లితాలు రాబ‌ట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ విధంగా ప‌నిచేసేందుకు పార్టీ కోస‌మే రోజుకు 18 గంట‌ల పాటు కాలం వెచ్చించేందుకు ఆయ‌న షెడ్యూల్ లో కూడా మార్పులు చేశారు.

వాస్త‌వానికి తెలుగుదేశం పార్టీలో ఇవాళ ఆయ‌న్ను దాటి ప‌నిచేసే నాయ‌కులు కూడా ఎవ్వ‌రూ లేరు. లోకేశ్ కూడా ఇంకా నేర్చుకోవాలి. ఇదే స‌మ‌యాన పార్టీకి సంబంధించిన నాయ‌కులంద‌రు కూడా ఇంకా అంకిత భావంతో ప‌నిచేయాల్సి ఉంది. ఇదే స‌మ‌యంలో కొంద‌రు మాత్రం త‌మ అధినేత చంద్ర‌బాబు ఆలోచ‌న‌ల‌నూ, ఆయ‌న నాయ‌కత్వాన్నీ మ‌రింత సుదృఢం చేసేందుకు కృషి చేస్తున్నారు ఇంకొంద‌రు. కానీ వైసీపీ వాద‌న మ‌రోలా ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచేది తామేనని, సింహం సింగిల్ గా వ‌స్తుంద‌ని జ‌గ‌న్-ను ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

ఇవే ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి. ఒక్కంటంటే ఒక్క రోడ్ షోతోనే వైసీపీ హ‌డ‌లిపోయి త‌మ‌పై విమ‌ర్శ‌లు చేస్తే ఏమ‌నుకోవాలి అని, ఇదెంత మాత్రం భావ్యం కాద‌ని అంటున్నారు టీడీపీ వ‌ర్గాల వారు. ఒక రోడ్ షో వంద‌ల సమ‌స్య‌ల‌కు కార‌ణం అయిందా ? అని కూడా అధికార పార్టీ నాయ‌క శ్రేణిని నిల‌దీస్తున్నారు వారు.

ఈ త‌రుణాన బాబు బైట్ మ‌రియు బాబు ఫైట్ కూడా ! ఇదే ! చంద్ర‌బాబు అనే తెలుగుదేశం పార్టీ అధినేత ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. రోడ్ షోల‌తో కొత్త ఉత్సాహం పార్టీలో నింపుతున్నారు. బాబొస్తున్నాడు అంటే చాలు విప‌క్ష పార్టీల‌న్నీ అల‌ర్ట్ అయిపోతున్నాయి. మిగ‌తా పార్టీల మాట‌కేం కానీ అధికార పార్టీ మాత్రం బాగానే శ్ర‌ద్ధ చూపుతోంది. ఎక్క‌డ టీడీపీ బ‌ల‌ప‌డుతుందో అని జాగ్ర‌త్త ప‌డుతోంది. ఆయన్ను ఫాలో చేస్తూనే ఆయ‌న్నొక కాలం చెల్లిన నేత కింద ప‌రిగ‌ణిస్తోంది.

ఇదే జ‌గ‌న్ వ‌ర్గం చేస్తున్న ప్ర‌ధాన త‌ప్పిదం. ఇటీవ‌ల శ్రీ‌కాకుళం జిల్లా, ఆమ‌దాల‌వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గం, పొందూరు మండ‌లం, ద‌ళ్ల‌వ‌ల‌స‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఎంతో హుందాత‌నంతో కూడి ఉన్నాయి. బూతులు లేవు. ఆయ‌నేం చెప్పాలనుకున్నారో ఆ మాజీ ముఖ్యమంత్రి హోదాలో, ఓ విప‌క్ష నేత హోదాలో చెప్పి వెళ్లారు.

కానీ వైసీపీ మాత్రం ఈ యాత్ర‌ను చూసి పలు ర‌కాలుగా మాట్లాడ‌డం త‌గ‌ద‌ని, తమ స‌క్సెస్ ను చూసి ఓర్వ‌లేక‌పోయినా ప‌ర్లేదు కానీ అనుచిత వ్యాఖ్యలు చేయవ‌ద్ద‌ని టీడీపీ హిత‌వు చెబుతోంది. అయినా కూడా వైసీపీలో దిగువ శ్రేణి నాయకులు సైతం చంద్ర‌బాబు యాత్ర‌కు సంబంధించి మాట్లాడుతున్నారు. స్థాయి మ‌రిచి మాట్లాడుతున్నారు. ఓవిధంగా గౌర‌వం మ‌న్న‌న అన్న‌వి ఇవ్వ‌కుండానే మాట్లాడుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న వీరికి పోటీ కాద‌ట ! గెలిచేది న‌డిచేది పరుగులు తీసేది తామేన‌ట ! ట ట‌ట ! అంటుంద‌ట వైసీపీ !

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version