జగన్ పై రోజురోజుకూ వ్యతిరేకత పెంచేసి..రాజకీయంగా తన బలం పెంచేసుకోవాలని చంద్రబాబు గట్టిగానే ట్రై చేస్తున్నారు. జగన్ అధికార పీఠంలో కూర్చున్నా దగ్గర నుంచి బాబు అదే పనిలో ఉన్నారు. ఎప్పటికప్పుడు జగన్ ని నెగిటివ్ చేయడానికి చూస్తున్నారు. ఎప్పుడు జగన్ పై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. అసలు ప్రజల్లో జగన్ పై వ్యతిరేకత పెరిగిపోయి…నెక్స్ట్ తాను అధికారంలోకి రావాలని బాబు గట్టిగా ట్రై చేస్తున్నారు.
ఇక బాబుకు సపోర్ట్ గా టీడీపీ అనుకూల మీడియా ఏ స్థాయిలో జగన్ ని టార్గెట్ చేసిందో చెప్పాల్సిన పని లేదు. అలాగే జగన్ కు వ్యతిరేకంగా ఉండే ప్రతి అంశాన్ని తనకు పాజిటివ్ గా మార్చేసుకోవాలని బాబు చూస్తున్నారు. అసలు టీడీపీతో సంబంధం లేకుండా…జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి సంఘటన జరిగిన…దాన్ని అనుకూలంగా మార్చేసుకోవాలని బాబు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే అలాంటి ప్రయత్నాలు చాలానే చేశారు..పలు సందర్భాల్లో జగన్ కు వ్యతిరేకంగా వచ్చిన సంఘటనలపై బాబు స్పందించి…ఇంకా జగన్ పై వ్యతిరేకత పెరిగేలా చేయడానికి చూస్తున్నారు. ఇక వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో కూడా బాబు కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. రాజుగారు ఏమో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం…దాన్ని బాబు సమర్ధించడం. అలాగే రాజుగారుపై ఏమన్నా కేసులు పెట్టిన, ఏదైనా జరిగిన బాబు వెంటనే భుజాన వేసుకుని…జగన్ ప్రభుత్వం హింసిస్తుందని మాట్లాడటం చేస్తున్నారు.
తాజాగా మహాసేన రాజేశ్ విషయంలో కూడా బాబు క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఇటీవల ఓ సంఘటనలో పోలీసులు మహాసేన రాజేశ్ ని విచారణకు పిలిచిన విషయం తెలిసిందే. ఈ విచారణలో పోలీసులు తనని ఇబ్బంది పెట్టారని, అలాగే తన కారు లాక్కున్నారని, తనతో పాటు వచ్చిన వ్యక్తిని ఇబ్బంది పెట్టారని రాజేశ్ చెప్పుకొచ్చారు. ఇక దీనిపై స్పందించి…బాబు..జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అధికారంలోకి వస్తే పోలీసులు అంతు చూస్తా అన్నట్లు మాట్లాడారు. అంటే జగన్ కు యాంటీగా ఏం జరిగిన దాన్ని అనుకూలంగా మార్చేసుకోవాలని బాబు ట్రై చేస్తున్నారు.