బాబుకు మరో సువర్ణావకాశం… యూస్ చేసుకుంటారా?

-

రాజకీయాల్లో సాధారణ ఎన్నికలు ఒకెత్తు అయితే.. పాలన మధ్యలో వచ్చే ఉప ఎన్నికలు మరొకెత్తు. సాధారణంగా ఆయా నాయకులు పార్టీలకు రాజినామాలు చేసిన సందర్భాల్లో ఉప ఎన్నికలు వస్తుంటాయి. కానీ.. ప్రస్తుతం జంపింగ్ జపాంగులు ఎక్కువగానే ఉన్నా కూడా ఉప ఎన్నికల దాఖలాలు లేవు! ప్రస్తుతం తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక అందుకు మినహాయింపు! సిట్టింగ్ ఎమ్మెల్యే కాలంచేస్తేనే ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తున్నాయి. అందులో భాగంగా ఏపీలో కూడా ఉప ఎన్నిక జరగనుంది!

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆకస్మిక మృతితో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమవుతోంది. ఈ ఎన్నికలో వైకాపా నుంచి వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధను పోటీలో పెట్టాలని అధికారపార్టీ భావిస్తుంది. ఇక నిన్నమొన్నటివరకూ సైలంట్ గా ఉన్న ప్రతిపక్షం కూడా ఈ ఉప ఎన్నికకు రంగం సిద్ధం చేసుకుంటుంది.

ఇందులో భాగంగా గత ఎన్నికలో ఓటమిపాలైన ఓబులాపురం రాజశేఖర్ నే ఈ ఎన్నికలో టీడీపీ నుంచి బరిలోకి దింపాలని ప్రధాన ప్రతిపక్షం భావిస్తుంది. దీంతో… ఏపీలో కూడా ఉప ఎన్నిక వేడి కాస్త మొదలైందనే చెప్పుకోవాలి.

అయితే… తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతున్నంత రసవత్తరతత అయితే ఏపీలోని ఉప ఎన్నికకు రాదనే చెప్పాలి. అధికారపార్టీ పాలనను ఎండగడుతూ.. తెలంగాణలో ప్రచారాలు హోరెత్తుతున్నాయి. కానీ ఏపీలో ప్రతిపక్షాలు అత్యంత బలహీనంగా ఉండటం వల్లో ఏమో కానీ బద్వేలులో అంత రసవత్తర రాజకీయం జరగడం లేదు!

జగన్ పాలనపై వ్యతిరేకత మొదలైందని మీడియాలో ప్రచారం చేస్తున్న బాబు… ఆ విమర్శలు నిజాలే అని నమ్మితే కచ్చితంగా అత్యంత బలంగా ఈ ఎన్నికకు సిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది! జగన్ పై ప్రజావ్యతిరేకత మొదలైందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పే ప్రయత్నం చేయాలి! టీడీపీకి కాలం చెల్లలేదని చెప్పే ప్రయత్నం చేయ్యాలి. కేడర్ లో ఉత్సాహం నింపాలి.

అలాచేసి ఈ ఉప ఎన్నికలో టీడీపీ గెలిస్తే… రాజకీయంగా ఆ పార్టీకి చాలా ప్లస్. ఫలితంగా స్థానిక సంస్థల ఎన్నికలు – పరిషత్ ఎన్నికల ఫలితాల దెబ్బకు మందు దొరికినట్లే అవుతుంది. మరి బద్వేలు ఉప ఎన్నికకు సంబందించి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎంత మేర బలమైన పోటీ ఇస్తుంది.. అనుకోకుందా వచ్చిన ఈ సువర్ణావకాశాన్ని ఏ మేరకు క్యాష్ చేసుకుంటుందనేది వేచి చూడాలి!!

Read more RELATED
Recommended to you

Exit mobile version