9 నెలల నుంచి ఫ్రిడ్జ్ లో ప్రియురాలి మృతదేహం కలకలం రేపింది. మధ్యప్రదేశ్ లోని బృందావన్ ధామ్ లో ఈ ఘటన కోటు చేసుకుంది. గత ఐదేళ్లుగా ప్రియురాలు ప్రతిభా అలియాస్ పింకీతో సంజయ్ పాటిదార్ సహజీవనం చేసాడు. వివాహం కోసం పింకీ ఒత్తిడి చేయడంతో తన స్నేహితుడు వినోద్ దేవ్ తో కలిసి ఆమెను హత్య చేసాడు సంజయ్ పాటిదార్.
కాళ్లు, చేకులు కట్టేసి మృతదేహాన్ని ఫ్రిడ్జ్ లో దాచిన సంజయ్… గత ఏడాది జూన్ లో ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. ఇంట్లోంచి దుర్గంధం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకుని ఫ్రిడ్జ్ లో పింకీ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు.
ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడు సంజయ్ ఉన్నాడు.