వైసీపీ గృహసారథులకు పోటీగా..టీడీపీ కొత్త కాన్సెప్ట్!

-

ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ని పెట్టి సంక్షేమ పథకాల అమలు బాధ్యత మొత్తం వైసీపీ వారిపైనే పెట్టిన విషయం తెలిసిందే. ఇక వాలంటీర్ అంటే వైసీపీ కార్యకర్త అనే సంగతి తెలిసిందే. ఇక వారు ఏ విధంగా ప్రజలని వైసీపీకి అనుకూలంగా మలిచేలా చేస్తున్నారో తెలిసిందే. అదే సమయంలో ఎన్నికల్లో గెలవడానికి వాలంటీర్లతో పాటు ఇద్దరు గృహసారథులని నియమిస్తున్నారు. ప్రతి గ్రామ/వార్డు సచివాలయ పరిధిలో  ముగ్గురు పరిశీలకులను నియమించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. వీరంతా ప్రభుత్వంతో సంబంధం లేకుండా పార్టీ విభాగంగానే పని చేయవలసి ఉంటుంది.

అయితే వీరి బాధ్యత వైసీపీని అధికారంలోకి తీసుకురావడం. ఇక వైసీపీకి ధీటుగా చంద్రబాబు సైతం కొత్త కాన్సెప్ట్ తో ముందుకొచ్చారు. టీడీపీ కుటుంబ సాధికార సారథులు పేరిట కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ప్రతి 30 ఇళ్లకు సాధికార సారథులని నియమిస్తామని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారికి పార్టీ అధికారంలో ఉండగా న్యాయం చేయలేకపోయామని, ఈ సారి అలా జరగకుండా పక్కా వ్యవస్థలని ఏర్పాటు చేస్తున్నట్లు బాబు చెప్పుకొచ్చారు.

అలాగే పార్టీలో ఉన్న సెక్షన్ ఇంచార్జ్‌లు అందరినీ కుటుంబ సాధికార సారథులు అని పిలుస్తామని అన్నారు. ఆర్ధిక అసమానతలు తొలిగించేలా వీరు పనిచేస్తారని, సాధికార సారథుల్లో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని, ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి విభాగం ఉంటుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

అంటే వైసీపీ తీసుకొచ్చిన గృహసారథులకు పోటీగా ఈ కుటుంబ సాధికార సారథులు టీడీపీ కోసం పనిచేయనున్నారు. మొత్తానికి ప్రజలని ఆకర్షించడానికి వైసీపీ, టీడీపీలు ఎడాపెడా ప్రయోగాలు చేస్తున్నాయి. మరి వీటిల్లో ఏది సక్సెస్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version