చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంట‌రీ పార్టీ భేటీని

-

ఈ నెల 18 నుంచి పార్లమెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే.. స‌మావేశాల‌కు మ‌రో 3 రోజులు మాత్ర‌మే స‌మ‌యమున్న నేపథ్యంలో.. ఆయా పార్టీలు స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహాలు పన్నుతున్నాయి. అయితే.. ఇందులో భాగంగా ఏపీలో విప‌క్ష పార్టీ టీడీపీ కూడా ఆ దిశ‌గా శుక్ర‌వారం పార్ల‌మెంట‌రీ పార్టీ భేటీని నిర్వ‌హించింది. ఈ సమావేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు అధ్య‌క్ష‌త‌న జరిగింది. అయితే.. ఈ స‌మావేశానికి టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు కింజ‌రాపు అచ్చెన్నాయుడు, పార్ల‌మెంటులో పార్టీ స‌భ్యులుగా కొన‌సాగుతున్న న‌లుగురు ఎంపీలు హాజ‌ర‌య్యారు.

టీడీపీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌లో క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర కుమార్ ఎంపీగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక లోక్ స‌భ‌లో టీడీపీకి ముగ్గురు సభ్యులున్నారు. విజ‌యవాడ ఎంపీ కేశినేని నాని, గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌, శ్రీకాకుళం ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడులు టీడీపీ ఎంపీలుగా ఉన్నారు. ఈ న‌లుగురు శుక్ర‌వారం నాటి టీడీపీపీ భేటీకి హాజ‌ర‌య్యారు. ఏపీ విభ‌జ‌న హామీల అమ‌లు కోసం పార్ల‌మెంటు స‌మావేశాల్లో పోరాటం కొన‌సాగించాల‌ని ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు చంద్ర‌బాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version