Breaking : అయ్యన్న భార్యకు చంద్రబాబు ఫోన్‌..

-

టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఈ తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. జగన్ ముఖ్యమంత్రిలా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ తెల్లవారుజామున నర్సీపట్నంలోని ఆయన ఇంటిలో ఆయనను, ఆయన కుమారుడు రాజేష్ ను అరెస్ట్ చేశారు. వీరిని విశాఖలోని సీఐడీ కార్యాలయానికి తరలించారు.

ఈ అరెస్ట్ పై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు దీనిపై స్పందిస్తూ… ముఖ్యమంత్రి జగన్ ఒక రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న కుటుంబాన్ని తొలి నుంచి కూడా వేధిస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర దోపిడీకి పాల్పడుతున్న వైసీపీని ప్రశ్నిస్తున్నందుకే అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. ఇంకోవైపు అయ్యన్నపాత్రుడు భార్య పద్మావతికి చంద్రబాబు ఫోన్ చేశారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. అయ్యన్నకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version