చంద్రబాబు ఆరోగ్యంపై మహిళ ప్రశ్న.. ఆసక్తికర సమాధానమిచ్చిన బాబు

-

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో మహిళలతో ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ మహిళ చంద్రబాబును ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది. “సార్… మిమ్మల్ని మేం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఇప్పటికీ అలాగే ఉత్సాహంగా ఉన్నారు. నేటికీ మీరు అలుపెరగకుండా పనిచేస్తుంటారు. ఇది ఎలా సాధ్యం?” అంటూ అడిగింది.


అందుకు చంద్రబాబు స్పందిస్తూ..  “మొదటిది… మనం చేసే పనిలో ఆనందం పొందాలి. నేను ప్రజల కోసం పనిచేస్తాను. అదే నాకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రజల కోసం పనిచేస్తున్నామన్న ఆనందంతో ఉత్సాహం రెట్టింపవుతుంది, ఎనర్జీ లెవల్స్ పెరుగుతూనే ఉంటాయి. అందుకే నేను ఉదయం నుంచి పడుకునే వరకు పనిచేస్తూనే ఉంటాను. రాత్రివేళ నిద్ర పోవాలి కాబట్టి నిద్ర పోతాను తప్ప నాకు అలసట అనేది ఉండదు. నిద్రపోవడం వల్ల బ్యాటరీ మాదిరిగా రీచార్జ్ అవుతాను. సెల్ ఫోన్ ను సరిగ్గా ఉపయోగించుకోగలిగితే అదే మీ ఆరోగ్య పరిరక్షణ సాధనం అవుతుంది” అని చంద్రబాబు వివరించారు.

ఇది ఇలా ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా బనగానపల్లె నుండి నంద్యాలకు చేరుకుంటున్న బాబు టాప్ ఆర్డర్ లీడర్లను తీవ్రస్థాయిలో మందలించే అవకాశాలు లేకపోలేదని పార్టీ కార్యకర్తలు, పరిశీలకులు బావిస్తున్నారు. ఇప్పటికే పార్టీకి అందిన నివేదికల ఆధారంగా సంద్యాల, ఆళ్ళగడ్డ, బనగానపల్లె, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, డోన్ నియోజకవర్గాలలోని పార్టీ ఇంఛార్జ్‌లు మాజీ మంత్రులు, మాజీ ఎమెల్సీలు ఇతర టాప్ ఆర్డర్ లీడర్ల మధ్యన విభేధాలు తారాస్థాయిలో ఉన్నాయని సమాచారం చంద్రబాబుకు అందించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version