ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై మరోసారి జనసేన నేత నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి వరకు గత మూసు సంవత్సరాలుగా చూస్తే ప్రభుత్వ పాటశాలల్లో చదివే 60 వేల మంది పిల్లలు వివిధ కారణాలతో మరణించారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు నాదెండ్ల మనోహర్. ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 2 లక్షల మంది విద్యార్థులు కనిపించకుండా పోయారంటూ ఆరోపణలు ప్రభుత్వం పైన చేశారు నాదెండ్ల. ఇప్పటి వరకు ఇటువంటి సంచలన నిజాలను ఎందుకు ప్రభుత్వం దాచిపెట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు నాదెండ్ల. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలలో విద్యను అభ్యసిస్తున్న 42 లక్షల మందిలో 2 లక్షల 29 వేల మంది విద్యార్థుల లెక్కలు తేలడం లేదని ఇందుకు ప్రభుత్వం బాధ్యత వహించి వారి పూర్తి వివరాలను తెలియచేయాలన్నారు.
కాగా ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ మహిళలు అదృశ్యంపై ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పిల్లల వివరాలపై ప్రశ్నించిన జనసేనకు అధికార పార్టీ సమాధానం ఇస్తుందా చూడాలి.