ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గుంటూరు మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గుంటూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి చంద్రబాబు నివాళులు అర్పించి అక్కడి నుంచి రోడ్ షో ప్రారంభించారు. అభివృద్ధి సంక్షేమం కోసం రాజకీయాలు చేయాలి కానీ ప్రజలను ద్రోహం చేసేందుకు రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. తమకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని వైసీపీ బెదిరిస్తోందని ఆయన అన్నారు. గుంటూరు ప్రజలకు సిగ్గుంటే వైసీపీ జెండా పట్టుకోరని ఆయన అన్నారు.
గుంటూరు ప్రజలకు రోషం , పౌరుషం లేదని, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు బ్రతికున్న చచ్చినట్లే లెక్క అని అన్నారు. ఇక్కడ ప్రజలు హైదరాబాద్ పాచి పని చేయడానికి వెళ్తున్నారు, ఇలాంటి వారికి ఇక్కడ ఉపాధి కల్పించాలని రాజధాని తెచ్చానని ఆయన అన్నారు. ఇక్కడ గుట్కా తయారీ వ్యక్తి వైసీపీ ఎమ్మెల్యే అని, ఎమ్మెల్యే అమ్మే గుట్కా తిని ప్రజలు తిని చావాలా..? అని ఆయన ప్రశ్నించారు. కరోనా వ్యాప్తి చేసింది వైసీపీ ఎమ్మెల్యేనే అని పేర్కొన్న ఆయన అమ్మ ఒడి 14000 ఇచ్చి నాన్న బుడ్డి 36,000 వచ్చారని విమర్శించారు. జగన్ అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.