చిత్తూరు జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభావం చూపించ లేదు. అక్కడ అక్కడ మినహా ఎక్కడా కూడా తెలుగుదేశం ప్రభావం లేకపోవడంతో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జిల్లా పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో కూడా కుప్పం నియోజకవర్గంలో వచ్చిన ఫలితాలపై అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రుల మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట.
మాజీ మంత్రి అమరనాథ రెడ్డి తీరుపై ఆయన మండిపడ్డారు అని తెలుస్తుంది. అలాగే చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న పులివర్తి నానిపై కూడా ఆయన అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. మరికొంతమంది నేతలు పార్టీని పట్టించుకోలేదని బెంగళూరులో ఎక్కువగా ఉంటున్నారు అని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. పార్టీ కోసం పని చేయని నేతలు తనకు అవసరం లేదని కూడా చెప్పారట.
కనీసం పోటీ చేసే అభ్యర్థుల తో కూడా మాజీ మంత్రులు చర్చలు జరపలేదని పార్టీలో కీలక పదవులు అనుభవించిన ఇప్పుడు సైలెంట్ గా ఉండడం ఎంతవరకు భావ్యమని చంద్రబాబు నాయుడు నేరుగానే ప్రశ్నించారట. త్వరలోనే ఒక సమావేశం నిర్వహించి వారిని పార్టీ నుంచి తప్పించే అవకాశం కూడా ఉందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మాజీ మంత్రి అమర్నాథరెడ్డి చంద్రబాబు నాయుడికి దెబ్బకొట్టినట్టుగా తెలుస్తుంది. ఆయన త్వరలోనే పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకున్నారని వచ్చే ఈ నెలలో ఆయన పార్టీ మారవచ్చని అంచనా వేస్తున్నారు.