పార్టీని బ్రతికించుకోవడానికి చంద్రబాబు కొత్త ప్లాన్…!

-

ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బ్రతికించుకోవడానికి గాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ ముందుకి వెళ్తున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏకంగా రాష్ట్ర పర్యటనకు సిద్దమయ్యారు. ప్రస్తుతం ఆ పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. ప్రభుత్వ వైఫల్యాలు, పెట్టబడులు, మూడు రాజధానుల అంశాలపై,

జగన్ సర్కార్‌ని ఎండగట్టడమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రజా చైతన్య యాత్రకు సిద్దమైంది. ఈనెల 17 నుంచి ఆ యాత్రం ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 175 నియోజకవర్గాల్లో 45 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జీ నేత‌ృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందులో భాగంగా ప్రజలను కలవనున్నారు.

అటు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం బస్సు యాత్ర చేయాలని యోచిస్తున్నారు. మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. 13 జిల్లాలు, 100కు పైగా నియోజవర్గాలలో జన చైతన్య యాత్ర చేయాలని భావిస్తున్నారు చంద్రబాబు. ఆ యాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వ్యూహం రచిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపధ్యంలో ఈ పర్యటనకు చంద్రబాబు సిద్దమయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version