పవన్ అడ్డు తొలగించేపనిలో నిమగ్నమైన చంద్రబాబు!

-

ఏపీలో టీడీపీ పరిస్థితి ఎన్నికల నాటికి ఎలా ఉంటుందో తెలియదు కానీ… ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. వారు చెబుతున్నట్లు జమిలీ ఎన్నికలు వచ్చినా, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా, సార్వత్రిక ఎన్నికలు వచ్చినా ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి! మరి అలాంటప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు పోటీ నెలకొంది!


అవును… ఏపీలో అధికారపక్షానికి అధికారికంగా మిత్రపక్షం లేకపోయినా.. సెంట్రల్ లో బీజేపీతో కాస్త చనువుగా ఉంటున్న సంగతి తెలిసిందే! ఈ కామెంట్ల నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును క్యాష్ చేసుకునే విషయంలో ఏపీ బీజేపీ పాత్ర పెద్దగా ఉండకపోవచ్చు! మరి ఇంక టీడీపీకి అడ్డెవరు అని అంటే… అది కచ్చితంగా జనసేన అనేది చంద్రబాబు నమ్మకంగా ఉంది!

అలా అని జనసేనతో మళ్లీ దోస్తీ కట్టి ముందుకు వెళ్దామంటే పవన్ కలిసే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో… చంద్రబాబుకి ఉన్న ఆప్షన్ ఒకటే ఒకటి! పవన్ ను కూడా విమర్శిస్తూ తమ అనుకూల మీడియాల్లో వార్తలు రాయించడం! పవన్ ఫుల్ టైం పొలిటీషియన్ కాదనే విషయాన్ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లడం! ప్రస్తుతం ఆ వర్గం మీడియా అదేపనిలో ఉంది! ఫలితంగా… ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు తాము మాత్రమే ప్రాధాన్యం అన్న స్కెచ్ బాబు స్టార్ట్ చేసినట్లే!

Read more RELATED
Recommended to you

Exit mobile version