24 నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన

-

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఈ నెల 24 నుంచి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నెల 24న కుప్పం చేరుకోనున్న చంద్ర‌బాబు.. వ‌రుస‌గా 3 రోజుల పాటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ప‌ర్య‌టించ‌నున్నారు. 24న నియోజ‌కవ‌ర్గంలోని రామ‌కుప్పం మండ‌లంలో ప‌ర్య‌టించ‌నున్న చంద్ర‌బాబు… 25న కుప్పం మండ‌లంలో ప‌ర్య‌టిస్తారు. ఆ త‌ర్వాత ఈ నెల 26న నియోజ‌కవ‌ర్గ ప‌రిధిలోని గుడిప‌ల్లె మండ‌లంలో చంద్ర‌బాబు ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌ల్లో భాగంగా నియోజ‌క‌వ‌ర్గంలోని పలువురు నేత‌ల‌తో ఆయన స‌మావేశం కానున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా పార్టీ శ్రేణుల‌కు ఆయ‌న ప‌లు కీల‌క సూచ‌న‌లు చేయ‌నున్నారు.

అయితే.. ప్రతి ఇన్‌చార్జ్‌ నియోజకవర్గంలో కనీసం 10 నుంచి 15 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు సూచించారు. అబ్జర్వర్‌‌గా ఉన్న నేతలు సైతం నెలలో కనీసం 8 రోజులు ఆ నియోజకవర్గంలో పర్యటించాలని సూచించారు. అసత్య ప్రచారమే వైసీపీ తన ప్రచార అస్త్రంగా చేసుకుందని.. దాన్ని క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలని ఇన్‌చార్జీలకు సూచించారు. స్థానిక సమస్యల‌పై ప్రజలను కలుపుకొని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కాగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపులకు గురైన కౌన్సిలర్ సూర్యనారాయణను పరామర్శించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version