గుజరాతీయుల రక్తంలోనే ఎంటర్‌ప్రెన్యూర్‌ లక్షణాలు ఉన్నాయి : మంత్రి కేటీఆర్‌

-

గుజరాతీయులపై మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఫిబ్రవరి 1 నుంచి నిర్వహించనున్న ప్లాస్ట్‌ ఇండియా-2023 ఎగ్జిబిషన్‌కు సంబంధించిన యాప్‌ను శనివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణాలో ఆవిష్కరించారు. ఈ సందర్భం గా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. దేశంలో ఎంటర్‌ప్రెన్యూర్‌ కల్చర్‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు మంత్రి కేటీఆర్‌. గుజరాతీలకు ఎంటర్‌ప్రెన్యూ ర్‌ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని, వారి నుంచి ఇతర ప్రాంతాల ప్రజలు ఎంతో నేర్చుకోవాల్సి ఉన్నదని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్‌. ఇతర దేశాల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. కానీ మన దేశంలో ఇంజినీర్‌, డాక్టర్‌, సీఏ, లాయర్‌ మరేదో కావాలని తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు సూచిస్తారని, ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలని ఎవరూ చెప్పరని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇండియాలో ఎంటర్‌ప్రెన్యూర్‌ కావడం అంత సులువు కాదన్నారు మంత్రి కేటీఆర్‌.

దేశంలో ఎవరైనా వ్యాపారవేత్తగా మారితే ఆయన వెనక ఎవరు ఉన్నారు? మంత్రి ఉన్నా డా? ఏ నాయకుడు ఉన్నాడు? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తారని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. గుజరాతీయుల రక్తంలోనే ఎంటర్‌ప్రెన్యూర్‌ లక్షణాలు ఉన్నాయని, అక్కడి నుంచే పెద్దపెద్ద వ్యా పారవేత్తలు వచ్చారని చెప్పారు. 1987 నాటికి భారత్‌, చైనా జీడీపీ ఒకే విధంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు చైనా జీడీపీ 16 ట్రిలియన్‌ డాలర్లకు చేరిందని తెలిపారు. మన దేశంలో అనుకున్నం త స్థాయిలో మార్పు జరగలేదని ఆవేదన వ్యక్తంచేశారు. మనం ఎందుకు వెనకబడ్డామో, చైనా సాధించినది మనం ఎందుకు సాధించలేకపోయామో ఆలోచించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version