నారా చంద్రబాబు నాయుడుకు రోజులు గడుస్తున్నా కొద్దీ కష్టకాలం ఇంకా ఎక్కువ అవుతోంది అని చెప్పాలి. ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైలులో రిమాండ్ కు వెళ్లి మూడు వారాలు కావస్తోంది.. అయినప్పటికీ తెలుగు దేశం పార్టీ కానీ , లాయర్ లు కానీ చంద్రబాబును బయటకు తీసుకురావడంలో మూకుమ్మడిగా విఫలం అయ్యారు. ఇక చంద్రబాబు FIR ను కొట్టేయాలని, హౌస్ అరెస్ట్ కు అనుమతివ్వాలని హై కోర్ట్ లో పిటీషన్ లు వేసినా తిరస్కరణకు గురయ్యాయి. తద్వారా సుప్రీమ్ కోర్ట్ లో పిటీషన్ లు వేసి పాజిటివ్ రిజల్ట్ కోసం టీడీపీ శ్రేణులు అంతా ఎదురుచూస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు బెయిలు పిటీషన్ పై విజయవాడ ఏసీబీ కోర్ట్ విచారణను అక్టోబర్ 4 కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
అంతే కాకుండా సుప్రీమ్ కోర్ట్ కూడా క్వాష్ పిటీషన్ ను ఆక్టోబర్ 3న విచారిస్తామని తెలపడంతో… ఈ రెండు పిటీషన్ లలో తీర్పులు వచ్చే వరకు అంటే అక్టోబర్ 4తేదీ వరకు చంద్రబాబు జైల్లోనే ఉండాల్సి వస్తోంది.