ఒంగోలులోని మండవారి పాలెంలో “మహానాడు” నిర్వహణకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మహానాడు నిర్వహణపై కమిటీలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఒంగోలు సమీపంలోని మండవారి పాలెంలోనే మహానాడు నిర్వహణకు ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలు నగర సమీపంలోని మండవారి పాలెంలో 27,28 తేదీల్లో మహానాడు జరుగనుంది. మొదటి రోజు ప్రతినిధుల సభ, రెండో రోజు బహిరంగ సభ ఉండనుంది.
మహానాడు నిర్వహణకు ఒంగోలు మినీ స్టేడియం ఇవ్వాలని కోరారు టిడిపి నేతలు. అయితే.. స్టేడియం ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది. అవసరమైన ఫీజు చెల్లించినా, ముందుగానే సంప్రదించినా స్టేడియం ఇవ్వడం కుదరదని వెల్లడించారు ఏపీ ప్రభుత్వ అధికారులు. మీటింగ్ కు స్టేడియం ఇవ్వకపోవడం పై టీడీపీ మండిపడుతోంది. ఇతర ప్రతిపాదనలు అన్నీ పక్కన పెట్టి త్రోవగుంటలోనే మహానాడు నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. నూతనత్వంతో, భావజాలం చాటేలా మహానాడు నిర్వహించాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, రాష్ట్ర భవిష్యత్తుకు టీడీపీ అవసరాన్ని చాటేలా మహానాడు ఉండాలని సూచనలు చేశారు.