తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 3 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 6,7,8 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్న చంద్రబాబు… వివిధ కార్యక్రమాల్లో పాల్గొని కార్యకర్తలు, ప్రజలను ఈ సందర్భంగా కలవనున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మీడియా తో మాట్లాడుతూ…రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నానని.. అనేక మంది సీఎంలు పని చేసినా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన సీఎం ఎవ్వరూ లేరని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఇప్పుడు ఆర్థిక విధ్వంసం జరుగుతోందని.. ఏపీ బ్రాండ్ ఇమేజీని దెబ్బ తీశారని ఫైర్ అయ్యారు. పారిశ్రామిక వేత్తలు మొదలుకుని రోజూ కూలీ వరకు పొరుగు రాష్ట్రాలకు వలస పోతున్నారని మండిపడ్డారు. గతంలో భువనేశ్వర్ నుంచి విశాఖకు వచ్చే వాళ్లు.. ఇప్పుడు విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్తున్నారని.. ఏసీబీ, సీఐడీలను కంట్రోల్లో పెట్టుకుని అందర్నీ బెదిరిస్తున్నారని ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారు. గౌరవానికి భంగం కలుగుతుందని భయపడి సైలెంటుగా ఉంటున్నారని.. ఈ గొడవలెందుకని ఇంకొందరు వలస పోతున్నారని మండిపడ్డారు.