మనదేశంలో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలను అమలు చేసినా… ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా… తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం డిడి గి ఈ ప్రాంతంలో ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న దంపతులు ఇద్దరూ, 8 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. అలాగే కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా సంఘటన స్థలంలోనే మృతి చెందడం గమనార్హం. అతి వేగంగా కారు దూసుకురావడంతో కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. బైక్ పై వెళ్తున్న దంపతులు అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లి కి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. కారులో మృతిచెందిన వ్యక్తి వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం అట్లూరు కు చెందిన మహ్మద్ ఫరీద్ గా గుర్తించారు. ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.