చంద్రబాబుది 100 రోజుల పాలన కాదు.. 100 రోజుల మోసం అని మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 100 రోజుల్లో సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవన్ లేదు. వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏంటంటే.. మోసమే అన్నారు. అన్నీ వ్యవస్థలు తిరోగమనం చేస్తున్నారు. ఇలా మొట్ట మొదటిసారిగా చూస్తున్నానని తెలిపారు. గతంలో పిల్లలకు విద్యాదీవెన, వసతి దీవెన అందేది. 9 నెలల్లో ఇంతవరకు ఏది అందలేదన్నారు.
ప్రజలకు చెప్పినవన్ని కూడా అబద్దాల మూటగా 100 రోజుల తరువాత చంద్రబాబు దోషిగా నిలబడతారు. స్కూళ్లన్నీ పూర్తిగా నిర్వర్యమయ్యారు. రైతులు పూర్తిగా రోడ్డున పడ్డారు. రైతులకు అందాల్సిన సహాయం అందలేదు. మా హయాంలో ఇస్తామన్న పెట్టుబడి కూడా ఇవ్వలేదు. రైతులకు ఉచిత పంట బీమా లేదు. ఈ క్రాపింగ్ లేదు. రైతుల పరిస్థితి అద్వానంగా మారింది. ఆరోగ్య శ్రీ బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయి. ఏ రంగం చూసుకున్నా.. తిరోగమనమే అన్నారు. గతంలో ప్రతీ రంగంలో పారదర్శకంగా జరిగేది అని తెలిపారు మాజీ సీఎం జగన్.