ఎక్కువ కాలం జీవించే వాళ్ళల్లో ఉండే కామన్ లక్షణాలు ఇవే.. మీరూ ఫాలో అవుతున్నారా..?

-

ప్రతీ ఒక్కరూ ఉన్నంతకాలం సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. ఆరోగ్యంగా ఉండడం కోసం ఎక్కువ కాలం జీవించే వాళ్ళు వీటిని ఫాలో అవుతారు. ప్రపంచంలో అత్యధిక సంవత్సరాలు బతికిన వృద్ధులు చాలామంది ఉన్నారు. వందేళ్ళ కంటే ఎక్కువ కాలం బతికిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే అలాంటి వాళ్ళు ఎలాంటి పద్ధతుల్ని పాటిస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. వీళ్ళ డైట్ చాలా ప్రత్యేకంగా ఉండేది. ఎక్కువగా పండ్లు, కూరగాయలు, ధాన్యాలు లేని ప్రోటీన్ వంటివి తీసుకునేవారు. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, షుగర్ తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకునేవారు.

జీన్ కల్మెంట్ అనే ఒక వ్యక్తి ప్రపంచంలోనే ఎక్కువ కాలం 122 ఏళ్లు బతికారు. ఎక్కువకాలం జీవించాలంటే వ్యాయామం చాలా ముఖ్యం. వ్యాయామం చేయడం వలన ఆరోగ్యంగా ఉండొచ్చు. నడవడం, రన్నింగ్, సైక్లింగ్ ఇటువంటివి ఏమైనా చేసుకోవచ్చు. అలాగే ఎక్కువ కాలం బతకాలంటే మంచి స్నేహితులుతో ఉండాలి. చుట్టూ ప్రపంచం ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి. మోటివేషన్ చేసే వాళ్ళు మన చుట్టూ ఉంటే మనకి ఆసక్తి పెరుగుతుంది. ఎమోషనల్ సపోర్ట్ కూడా ఉంటుంది. అదే విధంగా జీవితం పై అవగాహన కలిగి ఉండడం వలన మనం చేసే పనులు ఆసక్తిగా మారిపోతాయి.

ఒత్తిడిని కూడా జయించాలి. ఆఫీసులో పనులైనా, ఇంట్లో సమస్యలైనా ఒత్తిడిని తట్టుకోవాలి. ఒత్తిడిని తట్టుకోవడం వలన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. మానసిక ప్రశాంతత ఉంటుంది. జీవితకాలం కూడా పెరుగుతుంది. అలాగే ఎక్కువ కాలం జీవించడానికి జన్యువు కూడా కీలకం. పూర్వీకులు జీవన ప్రమాణాల ప్రభావం మీపై కూడా పడుతుంది. అలాగే ఎక్కువ కాలం జీవించడానికి ఆరోగ్యంగా ఉండడానికి నిద్ర చాలా ముఖ్యం. మంచి నిద్రని పొందితే ఆరోగ్యంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version