నేడు వరద బాధితుల ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

-

కోనసీమ జిల్లా : నేటి నుండి రెండు రోజులు పాటు టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందులో బాగంగానే నేడు కోనసీమలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు చంద్రబాబు.

ఈ సందర్భంగా వరద బాధితులను పరామర్శ, బలహీనంగా ఉన్న ఏటిగట్లు పరిశీలించనున్నారు చంద్రబాబు. అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు చంద్రబాబు నాయుడు. కాగా  శ్రీలంకలో ఉన్న దుర్భర పరిస్థితులు ఏపీలో ఇప్పటికే ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.

బుధవారం ఆయన మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందుకు ఎన్నో ఉదాహరణలున్నాయని చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా పనిచేసే ఉద్యోగులకు ఎప్పటి నుంచో సకాలంలో జీతాలు చెల్లించట్లేదు, తమ జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులను విత్ డ్రా చేసుకునే పరిస్థితుల్లో ఉద్యోగులు లేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు.అంతేకాక పదవీ విరమణ చేసిన వారికివ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పరిస్థితి లేదని చంద్రబాబు విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version