చంద్రయాన్-3 ప్రయోగానికి ముహూర్తం ఫిక్స్‌ చేసిన ఇస్రో

-

చంద్ర‌యాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్‌ను ఈనెల 14వ తేదీన ప్ర‌యోగించ‌నున్నారు. శ్రీహ‌రికోట‌లో స‌తీశ్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్ లాంచింగ్ ప్యాడ్ నుంచి మ‌ధ్యాహ్నం 2.35 నిమిషాల‌కు రాకెట్ నింగిలోకి ఎగ‌ర‌నున్న‌ది. ఈ విష‌యాన్ని ఇవాళ ఇస్రో వ‌ర్గాలు వెల్ల‌డించాయి. వాస్త‌వానికి చంద్ర‌యాన్‌3 మిష‌న్‌ను ఈనెల 13వ తేదీన ప్ర‌యోగించ‌నున్న‌ట్లు ఇటీవ‌ల ఇస్రో చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే ఒక రోజు తేడాతో ఈ ప్ర‌యోగాన్ని చేప‌ట్ట‌నున్నారు.

ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగం కోసం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రం సన్నద్ధమవుతోంది. చంద్రయాన్-2లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉండగా… చంద్రయాన్-3లో ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్ ను పొందుపరిచారు. చంద్రయాన్-2లోని ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగే క్రేమంలో విఫలమైన నేపథ్యంలో, అనేక మార్పులు చేర్పులతో చంద్రయాన్-3 ల్యాండర్ను అభివృద్ధి చేశారు. విక్రమ్ ల్యాండర్ కు బలమైన కాళ్లు అమర్చారు. అత్యధిక వేగంగా దిగినప్పటికీ దెబ్బతినని రీతిలో ల్యాండర్ కు రూపకల్పన చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version