ఈ దఫా నుంచే పోడు భూములకు రైతుబంధు, రైతు బీమా ఇస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సిరిసిల్లలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో 1,650 మందికి పోడుపట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ‘కుమురం భీం నినాదం జల్, జంగిల్, జమీన్ ను సాకారం చేస్తున్నం. దళితులను ధనికులు చేసేందుకే దళితబంధు తీసుకొచ్చాం. భవిష్యత్తులో భూ హద్దుల విషయంలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పకడ్బందీగా అటవీ యాజమాన్య హక్కులు రూపొందిస్తామని కేటీఆర్తెలిపారు.
ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల లో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ప్రభుత్వ నర్సింగ్ కళాశాల 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.స్వతంత్ర భారతదేశంలో ఈ అపూర్వమైన ఘనత అని పేర్కొన్న ఆయన తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి కి దగ్గరకు రాగల మరి ఏదైనా భారతీయ రాష్ట్రం ఉందా అంటూ ప్రశ్నించారు. నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుటీర వ్యాపార పథకం క్రింద ఈరోజు మంత్రి కేటీఆర్ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి 124 మంది ఎస్సీ లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేశారు.దళిత సమాజంలో పరివర్తన కృషి చేస్తున్నామని, దళిత బంధు మొదటి విడతలో సుస్థిర జీవనోపాధి లబ్ధిదారులు పొందేలా యూనిట్ల మంజూరు చేశామని కేటీఆర్ అన్నారు.సీఎం కేసిఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులను ధనికులు గా చేసేందుకు దళిత బంధు కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు.