టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతిశెట్టి గురించి కొన్ని రోజులుగా ఒక వార్త తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ప్రచారం అయిన మేరకు ఈ వార్త ఏ విధంగా ఉందంటే… ఒక స్టార్ హీరో తనయుడు కృతిశెట్టి ని వేధిస్తున్నట్లు… త్వరలో జరగనున్న తన బర్త్ డే పార్టీకి రావాలి అని ఫోర్స్ చేసినట్లు అవసరం అయితే ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని చెప్పినట్లు ఉంది. ఈ వార్తపై తాజాగా హీరోయిన్ కృతిశెట్టి మాట్లాడుతూ.. ముందుగా ఈ వార్తకు నాకు ఎటువంటి సంబంధం లేదు. పైగా ఇలాంటి వార్తలను నేను అస్సలు పట్టించుకోను అంటూ ఖరాఖండీగా చెప్పేసింది. నేను చూస్తున్న కొద్దీ రోజు రోజుకీ ఇష్టం వచ్చినట్లు రాసుకుంటూ పోతున్నారంటూ అసత్య వార్తలను రాసే మీడియా వారిపై అసంతృప్తిని వ్యక్తం చేసింది కృతిశెట్టి. ఇకపై నాపై ఇటువంటి అసత్య వార్తలను రాసే ముందు నన్ను సంప్రదించి నిజమో కాదో తెలుసుకుని రాయాలను అభ్యర్ధించింది.