ఈ నెల 22న చంద్రయాన్-2 ప్రయోగం.. వెల్లడించిన ఇస్రో..!

-

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం చంద్రయాన్-2. జూలై 15వ తేదీన ఈ ప్రయోగాన్ని నిర్వహించ తలపెట్టగా.. అది సాంకేతిక సమస్యలతో ఆగిపోయింది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం చంద్రయాన్-2. జూలై 15వ తేదీన ఈ ప్రయోగాన్ని నిర్వహించ తలపెట్టగా.. అది సాంకేతిక సమస్యలతో ఆగిపోయింది. ఆ తరువాత తిరిగి ఎప్పుడు చంద్రయాన్-2ను ప్రయోగిస్తారన్నది ఇస్రో సైంటిస్టులు వెల్లడించలేదు. అయితే ఇవాళ ఆ తేదీపై సైంటిస్టులు ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే జూలై 22వ తేదీన మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్-2 ను ప్రయోగిస్తామని ఇస్రో తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఇవాళ తెలిపింది.

అయితే చంద్రయాన్-2 ప్రయోగం 7 రోజులు ఆలస్యంగా ప్రారంభం అవుతుండడం వల్ల చంద్రుడిపై రోవర్ తిరిగే సమయంలో 7 రోజులను కోల్పోతామని పలువురు అభిప్రాయం వ్యక్తం చేసున్నారు. ఎందుకంటే జూలై 15వ తేదీనే చంద్రయాన్-2ను పంపి ఉన్నట్లయితే సెప్టెంబర్ 5 లేదా 6 తేదీల్లో రోవర్ చంద్రునిపై దిగేది. కానీ జూలై 22వ తేదీన చంద్రయాన్-2 ను ప్రయోగిస్తున్నారు కనుక.. సెప్టెంబర్ 11 లేదా 12 తేదీల్లో రోవర్ చంద్రుడిపై దిగుతుంది. ఇక అప్పటికి చంద్రుడిపై సూర్యకిరణాలు ఉండే వ్యవధి కేవలం 8 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత మంచు కారణంగా వాతావరణం అనుకూలించదు. అంటే కేవలం 8 రోజులు మాత్రమే రోవర్ పనిచేస్తుందన్నమాట.

అదే సెప్టెంబర్ 5, 6 తేదీల్లో రోవర్ చంద్రుడిపై దిగితే రోవర్‌కు చంద్రునిపై తిరిగేందుకు, సూర్య కిరణాలు చంద్రుడిపై ఉండే వ్యవధి 14 రోజులు ఉంటుంది. అంటే 14 రోజుల పాటు సూర్యకిరణాలు చంద్రునిపై పడతాయన్నమాట. ఆ తరువాత శీతలంగా మారుతుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 5, 6 తేదీల్లో చంద్రుడిపై దిగే రోవర్‌కు 14 రోజుల సమయం లభిస్తుంది. కానీ చంద్రయాన్-2ను ఆలస్యంగా ప్రయోగిస్తున్నందున రోవర్ చంద్రుడిపై తిరిగే సమయంలో 7 రోజులను కోల్పోతామని సైంటిస్టులు అంటున్నారు. మరి ఇస్రో ఈ విషయంలో ఏం చేస్తుందో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version