తెలుగు యూనివర్సిటీ కి సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా మార్పు.. అసెంబ్లీలో బిల్లు

-

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా పేరు మార్చారు.   పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును ప్రముఖ కవి, ఉద్యమకారుడు సురవరం ప్రతాప్ రెడ్డిగా మారుస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టారు మంత్రి దామోదర రాజనర్సింహ. 
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఈ బిల్లుపై అసెంబ్లీలో ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీ కాబట్టి.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకోవడం జరిగింది. కులం కోసమో, మతం కోసమో యూనివర్సిటీని పెట్టాల్సిన అవసరం లేదన్నారు. పొట్టి శ్రీరాములు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన గొప్ప దేశ భక్తుడు అని కొనియాడారు. అయితే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత విముక్తికి పోరాడిన గొప్ప వ్యక్తుల పేర్లను యూనివర్సిటీలకు పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే పలు వర్సిటీలకు పేర్లు మార్చినట్టు గుర్తు చేశారు. ఆ కోవలోనే తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించామన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news