బ్యాంక్ పనివేళల్లో మార్పు..ఇక నుంచి 30 నిమిషాలు ముందుగానే..!

-

బ్యాంకులకు మనం వెళ్లి ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే చూసుకుంటూ ఉంటాము. అయితే బ్యాంక్ టైమింగ్స్, సెలవలు కూడా మనం చూసుకు వెళ్ళాలి. బ్యాంకులకు వెళ్లే కస్టమర్లకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. బ్యాంకింగ్‌ పని గంటల లో మార్పు వచ్చింది.

ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. ఐదు రోజుల పని విధానం కోసం బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు పని గంటలు పెంచాలని అన్నాయి. ఇదిలా ఉంటే బ్యాంకు ఎంప్లాయీస్ బాడీ పంపిన లెటర్ లో బ్యాంక్ వేళలు ఉదయం 9.15 నుంచి సాయంత్రం 4.45కి మార్చాలని వుంది. క్యాష్ ట్రాన్సక్షన్స్ లో కూడా మార్పు చేశారట. ఐదు రోజుల పని వారాన్ని స్టార్ట్ చేయాలని పంపారని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటచాలం అన్నారు.

అరగంట పాటు వర్కింగ్ అవర్స్ ని పెంచుతూ ఐదు రోజుల పని విధానాన్ని కోరామని అన్నారు. ఐబీఏ, కేంద్రం, ఆర్‌బీఐ ఒప్పుకుంటాయని అన్నారు. అయితే గతంలో కరోనా సమయంలో ఐబీఏ ఆ ప్రతిపాదనను కొట్టివేసింది.

బ్యాంకు ఉద్యోగులకు 19 శాతం వేతన పెంపు ఇచ్చింది. ఈసారి కేంద్రం, ఆర్‌బీఐ, ఐబీఏ ఏం చెబుతాయో చూడాలి. ఒకవేళ ఓకే అంటే ఇక నుంచి అన్ని ఆదివారాలు, శనివారాలు బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయి. కానీ ప్రతి రోజూ ఉదయం 9.15కే బ్యాంకులు ఓపెన్ అయ్యి ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version