మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సర్ప్రైజ్లు మొదలుపెట్టబోతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా అలానే ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఒక సినిమా చూస్తున్నారు. పూజ కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూట్ ని స్టార్ట్ చేయబోతున్నారు. మే 27న చరణ్ పుట్టిన రోజు జరగబోతోంది. ఈ క్రమంలోనే అదిరిపోయే అప్డేట్స్ ని తీసుకోవాల్సినట్లు తెలుస్తోంది.
రాంచరణ్ గేమ్ చేంజర్ నుండి సాంగ్ విడుదల కాబోతున్న విషయం తెలిసిందే ఇప్పటివరకు ఈ సినిమా నుండి పెద్దగా అప్డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ ఈ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలానే ఆర్ సి 16 మూవీ నుండి టైటిల్ అనౌన్స్మెంట్ రాబోతుంది ఈ సినిమాకి పెద్ద, కలియుగ భీమా అని టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది మరి బుచ్చిబాబు ఏది ఫైనల్ చేస్తారనేది చూడాలి మొత్తానికి రామ్ చరణ్ బర్త్ డే సర్ప్రైజ్లు అదిరిపోబోతున్నాయి.