కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయంపై కామారెడ్డి జిల్లా గంభిరావుపేట ప్రజలు సంచలన ఆరోపణలు చేశారు.అంగన్వాడీ కేంద్రంలో ఉద్యోగం ఇప్పిస్తానని మాజీ ఎమ్మెల్యే మోసం చేశాడని, అందులోనే పనిచేస్తున్న పేద మహిళకు ప్రమోషన్ ఇప్పిస్తానని రూ.1,50,000 తీసుకొని మోసం చేశాడని ఆరోపించారు.
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని,భూవివాదాలు పరిష్కరిస్తానని ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేశాడని, ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమంటే బీహార్ మనుషులను పెట్టి చంపేస్తానని బెదిరిస్తున్నట్లు బాధిత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని గంభీరావుపేట మండల ప్రజలు వేడుకుంటున్నారు.
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం గురించి సంచలన విషయాలు బయటపెట్టిన గంభిరావుపేట ప్రజలు
అంగన్వాడి కేంద్రంలో పనిచేస్తున్న పేద మహిళకు ప్రమోషన్ ఇప్పిస్తానని రూ.1,50,000 తీసుకొని మోసం చేశాడు
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని,
భూవివాదాలు పరిష్కరిస్తానని ప్రజల వద్ద డబ్బులు వసూలు… pic.twitter.com/1WkGArsHge— Telugu Scribe (@TeluguScribe) February 8, 2025