కొండగట్టు ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అనంతరం ఆవిడ మాట్లాడుతూ.. రూ 1000 కోట్లతో కొండగట్టు అభివృద్ధికి కేసీఆర్ ప్రణాళిక వేశారు. అయితే అదే ప్రణాళికతో లేదంటే మరింత మెరుగైన ప్రణాళికతో కాంగ్రెస్ ప్రభుత్వం కొండగట్టును అభివృద్ధి చేయాలి. ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే క్షేత్రంపై రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం దృష్టిపెట్టాలి అని కవిత అన్నారు.
కాబట్టి కొండగట్టు ఆలయ అభివృద్ధిని ఆపవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. బీఆర్ఎస్ హయాంలో మొదలుపెట్టిన అభివృద్ధి పనులను కొనసాగించాలి. అయితే కొండగట్టు రోడ్డు అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం. కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవాలయ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. రూ 25 కోట్లు ఖర్చు చేసి కొండపై నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాం. దేవుడి భూములను కాపాడడానికి ప్రణాళిక రూపొందించాం అని గుర్తు చేసారు కవిత.