కంబోడియాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటూ హైదరాబాద్ వ్యక్తికి కుచ్చుటోపీ పెట్టారు. హైదరాబాద్ వ్యాపారికి నాలుగు కోట్లకు పైగా మోసగాడు టోపీ పెట్టాడు. జాబ్ కన్సల్టెన్సీ లు నిర్వహించే ఆదిత్య ను స్నేహితుల ద్వారా మోసగాడు కిరణ్ కుమార్ రెడ్డి పరిచయం చేసుకున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో కిరణ్ కుమార్ రెడ్డి ఆదిత్యను ముగ్గులోకి దింపాడు. కంబోడియా దేశంలో విల్లాలు నిర్మిస్తే అత్యధిక లాభాలు ఉంటూ నమ్మించి పెట్టుబడి పేరుతో 2017 లో ఆదిత్య నుండి నాలుగు కోట్లు తీసుకున్నాడు.
తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖం చాటేసాడు. దాంతో నిందితుడిపై జూబ్లీహిల్స్ పీఎస్ లో బాధితుడు ఆదిత్య ఫిర్యాదు చేశాడు. జూబ్లిహిల్స్ పోలీసుల సూచనతో హైదరాబాద్ సీసీఎస్ లో ఇటీవల ఫిర్యాదు నమోదైంది. ఇక ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. అయితే బాధితులు ఒక్కక్కరిగా బటయకు రావడంతో కేసులు నమోదు అవుతున్నాయి.