పెళ్లి పేరుతో మోసం.. హీరో ఆర్యపై చీటింగ్ కేసు

-

తమిళ స్టార్ హీరో ఆర్య పై జర్మనీకి చెందిన ఓ మహిళ అ చీటింగ్ కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి హీరో ఆర్య… దారుణంగా మోసం చేశాడని ఆరోపణలు చేసింది జర్మనీ యువతి. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఆర్య… ఏకంగా 70 లక్షల రూపాయలు అన్యాయంగా తీసుకున్నాడని ఆ మహిళ పేర్కొంది.

ఈ మేరకు విజ్దా ఆన్లైన్ లో  ఫిర్యాదు చేసింది జర్మనీ యువతి. వారిద్దరి మధ్య జరిగిన… వాట్సాప్ సంభాషణను కూడా ఈ ఫిర్యాదులో జోడించింది. అంతేకాదు హీరో ఆర్య తర్వాతి సినిమాలు కూడా విడుదల కాకుండా బ్యాన్ విధించాలని ఆమె డిమాండ్ చేసింది. ఈ కేసుపై గురువారం విచారణ జరిగింది. మరిన్ని ఆధారాలు సేకరించాలని పోలీసులను జడ్జి ఆదేశించారు. ఇక ఈ కేసును ఆగస్టు మాసం 17 వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. అయితే ఈ కేసు పై హీరో ఆర్య మరియు అతని టీం ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కాగా ఇటీవలే హీరో ఆర్య భార్య సాయోషా సైగల్… ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version