ఎంపీ కవిత కు హైకోర్టులో ఊరట..

-

మానుకోట టిఆర్ఎస్ ఎంపీ కవిత కు తెలంగాణ హైకోర్టు లో భారీ ఊరట లభించింది. ఇటీవల ప్రజాప్రతినిధులు కోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే విధించింది తెలంగాణ హైకోర్టు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా డబ్బులు పంపిణీ చేసారని 2019 లో ఎంపీ కవిత పై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.

అయితే దీనిపై ఆరు నెలల జైలు శిక్ష 10 వేలు జరిమానా విధించింది తెలంగాణ ప్రజా ప్రతినిధులు కోర్టు. ప్రజా ప్రతినిధులు కోర్ట్ తీర్పు పై ఇవాళ తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు టిఆర్ఎస్ ఎంపీ కవిత. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు కోర్ట్ తీర్పు పై స్టే విధించింది తెలంగాణ హైకోర్టు. దీంతో టీఆర్ఎస్ ఎంపీ కవిత ఊరట లభించింది. కాగా ఇటీవలే ఖైరతాబాద్ టిఆర్ఎస్ ఎమ్యెల్యే దానం నాగేందర్  వివాదం లోనూ తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో  ఎమ్యెల్యే దానం నాగేందర్ కూడా ప్రజాప్రతినిధులు కోర్టు విధించిన శిక్షలో ఊరట లభించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version