సిబిల్ స్కోర్ తెలుసుకోవాలా..? గూగుల్ పే యాప్ తో ఇలా తెలుసుకోండి..!

-

సిబిల్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు జరిపేవారికి… బ్యాంకుల్లో రుణాలు, క్రెడిట్ కార్డులు తీసుకునేవారికి సిబిల్ స్కోర్ చాలా ముఖ్యము. ఇది వరకు అయితే సిబిల్ స్కోర్‌ను పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అందరు మంచిగా సిబిల్ స్కోర్ ఉండాలని చూస్తున్నారు. సిబిల్ స్కోర్ చెక్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

google-pay

సిబిల్ స్కోర్‌ను చెక్ చేసుకునే ఆప్షన్ ని పలు సంస్థలు ఫ్రీగానే ఇస్తున్నాయి. ట్రాన్స్‌ యూనియన్ సంస్థ కూడా ఏడాదికి ఒక సారి ఉచితంగా సిబిల్ స్కోర్ చెక్ చేసుకునే అవకాశం ఇస్తోంది. మీరు ఇక గూగుల్ పే నుండి కూడా ఫ్రీగా సిబిల్ స్కోర్ ని పొందొచ్చు. ఇక మరి ఎలా గూగుల్ పే నుండి సిబిల్ స్కోర్ ని పొందొచ్చు అనేది చూసేద్దాం.

దీని కోసం మొదట మీరు Manage Your Money సెక్షన్‌ లో చెక్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ పైన క్లిక్ చేయాలి.
తర్వాత పాన్ కార్డులో ఉన్నట్టుగా మీ పేరు ని ఎంటర్ చేసేయండి.
తర్వాత మీ పాన్ నెంబర్ ఎంటర్ చేసేసి… ట్రాన్స్‌యూనియన్ దగ్గర ఉన్న మీ డేటా ప్రకారం
సిబిల్ స్కోర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒకవేళ రాలేదు అంటే మీరు ఎలాంటి రుణాలు లేదా క్రెడిట్ కార్డ్ తీసుకోలేదని.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version