గోవా వెళ్తున్నారా..? అయితే ఈ కొత్త రూల్స్ చూడండి..!

-

చాలామందికి గోవా వెళ్లడం ఒక పెద్ద కల. ముఖ్యంగా పెళ్లికి ముందు బ్యాచిలర్ పార్టీ కి వెళ్లడం.. లేదంటే సరదాగా ఎంజాయ్ చేయడం వంటివి చేస్తారు. సెలవుల్లో అయితే గోవాలో రద్దీ ఎక్కువగా ఉంటుంది మద్యం ప్రియులకి మాత్రమే కాదు హనీమూన్ జరుపుకునే వాళ్ళకి కూడా ఇది మంచి స్పాట్. అయితే ప్రభుత్వం పర్యటకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని రూల్స్ ని తీసుకువచ్చింది.

ఈ రూల్స్ ని అధిగమిస్తే జరిమానా తప్పదు. ఇక మరి మనం పూర్తి వివరాల్లోకి వెళ్దాం. గోవా లో బీచ్ లో ఎంజాయ్ చేయడానికి వచ్చేవాళ్ళు వివిధ రకాలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే కొంత మంది తీరు వలన ఇతర పర్యటకులకు ఇబ్బంది కలుగుతుంది. దీనిని దృష్టి లో పెట్టుకుని గోవా ప్రభుత్వం కొత్త రూల్స్ ని తీసుకువచ్చింది. ఎక్కడపడితే అక్కడ పర్యాటకులు ఫొటోస్ ని క్లిక్ చేయకూడదు.

దీని వలన ఇతర పర్యటకులు కూడా ఆ ఫోటోలో పడుతున్నారు. ముఖ్యంగా ఫారెన్ నుండి వచ్చిన టూరిస్టుల ఫోటోలు ఎక్కువగా క్లిక్ చేస్తూ ఉంటారు. ఇకపై ఇతరుల అనుమతి లేకుండా ఫోటోలను క్లిక్ చేయకూడదని గోవా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలానే గోవా కి వచ్చిన వాళ్ళు బీచ్ ఒడ్డున వంటలు చేసుకుంటూ ఉంటారు దీని వలన ప్రమాదాలు జరుగుతున్నాయి అందుకనే వంటలు చేయడానికి.. అలానే బీచ్ ఒడ్డున ఇక నుండి మద్యం తీసుకోవడం కూడా కుదరదు.

పర్యటకుల కారణంగా సముద్రంలోని జీవాలకు హాని కలుగుతుంది అందుకని గోవా ప్రభుత్వం ఈ రూల్స్ ని తీసుకువచ్చింది. ఒకవేళ కనుక ఈ రూల్స్ ని కనుక క్రాస్ చేస్తే 50,000 రూపాయలు కట్టాలి. అయితే బీచ్ లో ఫొటోస్ తీసుకోవచ్చు. కానీ ఇతరులు అనుమతి లేకుండా వారి ఫొటోస్ ని క్లిక్ చేయకూడదు ముఖ్యంగా ఫారనర్స్ కనబడితే వాళ్ళ ఫొటోస్ ని క్లిక్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్లతో పాటు ఫొటోస్ తీసుకోవాలంటే కచ్చితంగా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి లేదంటే 50 వేల రూపాయలు కట్టక తప్పదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version