అక్టోబర్ 1 నుంచి ఈ బ్యాంకు చెక్ బుక్స్ పనిచేయవు..!

-

ఈ బ్యాంక్ లో ఖాతా ఉందా..? అయితే తప్పకుండ మీరు ఈ విషయాలని తెలుసుకోవాలి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. బ్యాంకుల్ని విలీనం చేసుకున్న బ్యాంకులు ఈ మార్పుల గురించి కస్టమర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక ముఖ్యమైన అప్డేట్ ని ఇచ్చింది.

 

ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (OBC), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) పాత చెక్ బుక్స్ ఇక పని చెయ్యవు అని పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెల్లడించింది. కనుక ఇంకా ఆ బ్యాంక్ చెక్ బుక్స్ వాడుతూ ఉంటే మార్చుకోండి. eOBC, eUNI పాత చెక్ బుక్స్ 2021 అక్టోబర్ 1 నుంచి పని చేయవని, వాటిని పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్ బుక్స్‌ తో అప్‌డేట్ చేయాలని కోరుతోంది.

ఐఎఫ్‌ఎస్‌సీ, ఎంఐసీఆర్‌ తో కొన్న కొత్త చెక్ బుక్స్ తీసుకోవాలని పాత ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు తెలిపింది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త చెక్ బుక్స్ మాత్రమే ఉపయోగించాలి. కనుక ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, పీఎన్‌బీ వన్, కాల్ సెంటర్ ద్వారా కూడా కొత్త చెక్ బుక్ కోసం దరఖాస్తు చేయొచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే 1800-180-2222 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి తెలుసుకో వచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version