కోర్టు ఆదేశాల మేరకు sbi ఇటీవల ఈసీకి ఎలక్టోరల్ బాండ్ల వివరాలను పీడీఎఫ్ రూపంలో అందించిన సంగతి తెలిసిందే.SBI బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నంబర్లను ఎన్నికల కమిషన్‌కు అందించకపోవడాన్ని ఇటీవల సుప్రీంకోర్టు మండిపడింది.దీంతో ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టింది.సుప్రీంకోర్టు సూచనతో బాండ్ల వివరాలను వెబ్‌సైట్‌లో మరోసారి వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరిచినట్లు ఎక్స్‌లో ఈసీ పేర్కొంది.
ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ రూ.6 కోట్ల మేర ఎలక్ట్రోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. ఆ మొత్తాన్ని తమిళనాడులోని ఏఐఏడీఎంకే పార్టీకి డొనేట్ చేసినట్లు ఈసీ పేర్కొంది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ ఎన్. శ్రీనివాసన్కు చెందిన ఇండియా సిమెంట్స్ సంస్థ రూ.10 కోట్ల విలువచేసే బాండ్లను కొనుగోలు చేసి డీఎంకే పార్టీకి డొనేట్ చేసింది.