ఛత్తీస్గడ్ లో హృదయవిదారక ఘటన…. కూతురు శవాన్ని భుజాన మోస్తూ 10 కిలోమీటర్లు నడిచిన తండ్రి

-

ఛత్తీస్గఢ్ లో ఛత్తీస్గడ్ లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. వైద్యం కోసం వచ్చిన తన కూతురిని కాపాడుకోలేని తండ్రి… కూతురు శవాన్ని భుజాన వేసుకుని 10 కిలోమీటర్లు నడిచి స్వగ్రామానికి చేరిన ఘటన అందర్ని కంటతడి పెట్టిస్తోంది. ఈ సంఘటన మన దేశంలో ప్రభుత్వ వైద్యశాలల పనితీరును ప్రశ్నించే విధంగా ఉంది. ఈ వీడియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ ఘటనపై ఛత్తీస్గఢ్ ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్ సింగ్ డియో విచారణకు ఆదేశించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సర్గుజా ఈ ఘటన జరిగింది. బాలిక సురేఖకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె తండ్రి ఈశ్వర్ దాస్ సొంత గ్రామం అమ్దాలా నుంచి లఖాన్ పుర్ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ.. బాలిక మరణించింది. అయితే మృతదేహాన్ని తరలించేందుకు వాహనం రావడానికి ముందే తండ్రి శవాన్ని మోసుకుంటూ 10 కిలోమీటర్లు నడిచాడు. ఈ వీడియోను కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గామారింది. అయితే వైద్యం కోసం బాలికను ఆస్పత్రికి తీసుకువచ్చే సమయంలో బాలిక ఆక్సిజన్ లెవల్స్ 60 మాత్రమే ఉన్నాయని.. ఆమె ఐదు రోజుల ముందు నుంచే జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. బాలిక పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం చనిపోయిందని వైద్యులు తెలిపారు. అయితే వాహనం వస్తుందని తండ్రికి చెప్పామని.. కానీ అది రాకముందే శవాన్ని తీసుకుని బయలుదేరాడని వెల్లడించారు. అయితే ఈ విషయం ఛత్తీస్గడ్ ఆరోగ్యమంత్రి టీఎస్ సింగ్ దృష్టికి రావడంతో విచారణకు ఆదేశించారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటు వేయాలని అధికారులను ఆదేశించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version