రైల్వే ట్రాక్‌లకు నిప్పంటించారు..

-

యూఎస్‌లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు పడిపోతేనే మనం గడ్డకట్టుకుపోతున్నాం. వణికిపోతున్నాం.. బయటికి రావడానికి భయపడిపోతున్నాం. మరి.. యూఎస్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత ఎంతకు పడిపోయిందో తెలుసా? మైనస్ 50 డిగ్రీలకు పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో అయితే మైనస్ 60 డిగ్రీలకు కూడా పడిపోయింది. దీంతో అమెరికా ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే దడుసుకుంటున్నారు. ఆఫీసులు లేవు.. స్కూళ్లు లేవు.. గత కొన్ని రోజులుగా ఇంట్లోనే మకాం.

ఇక.. ఇంత తీవ్రమైన చలి అంటే.. ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రవాణా వ్యవస్థకు ఆటంకాలు ఏర్పడుతాయి. రోడ్ల మీద మంచు పడిపోవడంతో రోడ్లు బ్లాక్ అవడం.. చలితీవ్రతకు రైల్వే ట్రాక్ కుంచించుకుపోవడం జరుగుతుంది. దీంతో రైలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని.. చికాగోలో రైల్వే ట్రాక్‌లకు మంటలు పెడుతున్నారు. అలా అయితే చలిని, వేడిని ట్రాక్‌లు బ్యాలెన్స్ చేసుకోగలవని.. ట్రెయిన్స్ ట్రాక్‌లపై స్మూత్‌గా వెళ్లే అవకాశం ఉంటుందని ఇలా చేస్తున్నారు. ఇది ఇప్పుడే కొత్తగా చేసిందేమీ కాదు. ప్రతి సంవత్సరం చలి తీవ్రత పెరిగితే ఇలా ట్రాక్‌లకు అక్కడ నిప్పంటిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version