మాజీ ప్రధాని మన్మోహన్ కి భారత రత్న ఇవ్వాలి.. పి చిదంబరం.

-

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నేడు తన 88వ పుట్టినరోజుని జరుపుకున్నాడు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ఐతే మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ కి భారత రత్న ఇవ్వాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేసాడు. దేశానికి ఎన్నో సేవలందించిన మన్మోహన్ సింగ్, భారత రత్నకి అర్హుడంటూ పేర్కొన్నాడు.

సాధారణ జీవితం నుండి ఆర్థిక మంత్రిగా, దేశ ప్రధానిగా ఆయన ఎన్నో సేవలు చేసారని, భావి భారత పౌరులకు మన్మోహన్ జీవితం దిశా నిర్దేశం చేస్తుందని, స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నాడు. 2004 నుండి 2014 వరకు దేశ ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్, 1991లో ఆర్థిక మంత్రిగా పీవీ నరసింహారావు ప్రభుత్వంలో పనిచేసారు. ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంలో మన్మోహన్ సింగ్ పాత్ర చాలా పెద్దది.

మన్మోహన్ సింగ్ పది సంవత్సరాల పాటు ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా పి చిదంబరం పనిచేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version