బాలు కోసం డ్రైవర్ గా రామోజీరావు..

-

ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి మరణం ప్రపంచవ్యాప్త సంగీత ప్రియుల్ని తీవ్రంగా కలచివేసింది. గాన గంధర్వుడి గాత్రం ఇక వినలేమన్న విషయం కంటనీళ్ళు తెప్పిస్తుంది. 45వేలకి పైగా పాటలు పాడి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న బాలు గారు పాడుతా తీయగా ప్రోగ్రాం ద్వారా నూతన గాయనీ గాయకులకు దిశా నిర్దేశం చేసేవారు. ఈ ప్రోగ్రామ్ కి బాలుగారిని పట్టుబట్టి మరీ రామోజీరావు గారు తీసుకొచ్చారట. చెన్నైలో నివాసముండే బాలుగారు పాడుతా తీయగా ప్రోగ్రాం కోసం రెగ్యులర్ గా హైదరాబాద్ కి వచ్చేవారు.

హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఎయిర్ పోర్ట్ నుండి మొదలెడితే ఆ తర్వాత మళ్ళీ తిరిగి చెన్నైకి వెళ్ళడానికి ఎయిర్ పోర్టుకి చేరుకుకే వరకూ రామోజీ గారి కంపెనీ కారులోనే వెళ్ళేవారట. ఎప్పుడు వచ్చినా రామోజీగారి ఆఫీసుకి ఫోన్ చేసి కారు తెప్పించుకునేవాడట. అలా ఒకసారి హైదారాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగాక ఆఫీసుకి ఫోన్ చేస్తే ఎవరూ స్పందించలేదట. దాంతో రామోజీగారి ఇంటికి ఫోన్ చేసారట. అపుడు ఫోన్ ఎత్తిన రామోజీ గారితో నేను ఎయిర్ పోర్ట్ లో ఉన్నానండి ఎవరినైనా డ్రైవర్ ని పంపించండి అన్నారట.

అప్పుడు ఆదివారం కావడం వల్ల డ్రైవర్లందరూ లీవ్ లో ఉన్నారని రామోజీ గారు చెప్పారట. ఆ తర్వాత రామోజీగారే, ఒక డ్రైవర్ ఉన్నారు. కానీ కారు నడిపి చాలా రోజులు అవుతుంది అన్నాడట. ఎవరు అని అడిగితే నేనే అన్నారట. ఆ క్షణంలో నేను మరో చనువు తీసుకుంటున్నానా అని బాలు ఫీల్ అయ్యారట. అలా ఆరోజు రామోజీగారు బాలు గారికి డ్రైవర్ గా మారారు. ఈ విషయాన్ని పాడుతా తీయగా ప్రోగ్రాంలో బాలుగారు అందరితో పంచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version