ఇటీవలే ఉత్తరప్రదేశ్లో మద్రాసుకు చెందిన ఓ యువతిపై సామూహిక అత్యాచారం సంచలనంగా మారిపోయింది. అయితే యువతిపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని అంటూ రోజురోజుకు ఉత్తరప్రదేశ్లో ఆందోళనలు ఎక్కువైపోతున్నాయి.. బాధిత యువతి కుటుంబ సభ్యులు బంధువులతో పాటు ఎంతోమంది స్వచ్ఛంద సంఘాలు సైతం… నిందితులకు ఉరి శిక్ష పడాలి అంటూ ఆందోళనలు చేపడుతున్నారు. ఇక కొన్ని కొన్ని ప్రాంతాలలో అయితే ఈ ఆందోళనలు మరింత ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తాయి.
కొంతమంది ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పాటు వాహనాలకు నిప్పు అంటిస్తు ఉండడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపు చేసే పనిలో పడ్డారు. కాగా ఎట్టి పరిస్థితుల్లో అత్యాచార నిందితులకు కఠినంగా ఉరి తీయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. నిందితులకు ఉరిశిక్ష పడేంత వరకు తమ ఆందోళనలు ఆపే ప్రసక్తి లేదు అంటూ డిమాండ్ చేస్తున్నారు బాధితురాలి కుటుంబ సభ్యులు బంధువులు స్వచ్ఛంద సంఘాలు. ఇక ఈ కేసుపై సిట్ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసినట్లు యూపీ సీఎం యోగి తెలిపారు.