ముఖ్యమంత్రి దూరదృష్టి వల్ల తెలంగాణలో ప్రతిరోజు మృగశిరకార్తిగా మారిపోయింది – మంత్రి జగదీశ్ రెడ్డి

-

నల్లగొండ జిల్లా మునుగోడు (మం)కిష్టాపురం గ్రామంలో గొర్రెలకు, పశువులకు, వ్యాక్సినేషన్ ను ప్రారంభించి, అనంతరం పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలారు తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, పాల్గొన్న MP బడుగుల లింగయ్య యాదవ్. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి దూర దృష్టివల్ల తెలంగాణలో ప్రతిరోజు మృగశిర కార్తిగా మారిపోయిందని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు సంవత్సరాల కాలంలోనే మునుగోడులో ఫ్లోరైడ్ తగ్గించేలా చర్యలు తీసుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని కొనియాడారు.

చెరువులు అద్భుత సంపద సృష్టిస్తాయని గుర్తించింది కేసీఆర్ అని.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి అమోఘం అన్నారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. సంక్షేమంలో ముందున్న టిఆర్ఎస్, కెసిఆర్ కు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని అన్నారు. చేతివృత్తులకు ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ మాత్రమేనని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version