కారు డ్రైవర్ నిర్లక్ష్యం కాస్త చిన్నారిని బలిగొన్నది. ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారని తల్లిదండ్రులను గమనించలేదు. ఆడుకుంటున్న చిన్నారి రోడ్డుపై గల స్పీడ్ బ్రేకర్ పై కూర్చున్నది.పక్కన ఉన్న కారు డ్రైవర్ ఆ విషయాన్ని గమనించకుండా కారును స్టార్ట్ చేసి పోనిచ్చాడు.
ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వడ్డేపల్లి ఎంక్లేవ్‌లో ఈ నెల 16న చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అద్రితి (2) అనే చిన్నారికి తీవ్ర గాయాలవ్వగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నాటి నుంచి చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు వెల్లడించారు. దీంతో చిన్నారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.