ఏపీ ప్రజలకు అలెర్ట్. ఏపీలో రేపటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. 40 నుంచి 50 కిమీ వేగంతో ఈదురుగాలులు, పలు చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. ఇటు తెలంగాణలో కూడా నేడు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులు వడగండ్ల వానలు పడనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వడగండ్ల వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, ములుగు, వరంగల్ జిల్లాల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్ర, శనివారాల్లో ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వానలు కురుస్తాయని ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. గురువారం పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి.